నంద్యాలలో ఆదర్శ రైతు అప్పిరెడ్డి సంస్మరణ సభ
NANDYAL Aug17 :- నంద్యాల నంది రైతు సమాఖ్య కార్యాలయంలో సోమవారం సమాఖ్య ముఖ్య సలహాదారులు డా. కాదరబాద్ రవీంద్రనాథ్ గారి అధ్యక్షతన కీ.శే అప్పిరెడ్డి గారి సంతాప సభ నిర్వహించారు.పాండురంగాపురం గ్రామ ఆదర్శ రైతు ఆరిమండ అప్పిరెడ్డి గారు ఇటీవల స్వర్గస్తులవడం పట్ల సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అప్పి రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా అప్పి రెడ్డి గారి జీవిత విశేషాలను, వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలను సభ్యులు గుర్తు చేసుకున్నారు. రైతుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు B.V. రామసుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు Y. చంద్రశేఖర రెడ్డి, ప్రధాన కార్యదర్శి M.V. కృష్ణారెడ్డి, కోశాధికారి మధుసూదన్ రెడ్డి, కోఆర్డినేటర్ ఓబులపతి తదితరులు పాల్గొని వ్యవసాయంలో “అప్పిరెడ్డి” ఆదర్శ రైతుగా ఎదిగిన ప్రస్థానాన్ని కొనియాడారు. కార్యక్రమంలో శివరామకృష్ణారెడ్డి, బలపనూరు సుబ్బారెడ్డి, మాధవస్వామి, డాక్టర్ కిషోర్ కుమార్, ఎస్ ఎం డి రఫీ తదితర రైతు నాయకులు పాల్గొని అప్పి రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Arattai