నంద్యాల పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
NANDYAL Sep17:– నంద్యాల పట్టణం, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.విశ్వకర్మ భగవానుడికి పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆనంతరం లోక కళ్యాణార్థం విశ్వకర్మ శాంతి హోమాన్ని నిర్వహించారు.అనంతరం ప్రసాద వితరణ చేశారు.నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు అభిరుచి మధు,నంద్యాల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సూర్య ప్రకాష్ ఆచారి చంద్రశేఖర ఆచారి పాల్గొన్నారు
Arattai