అవసరమైనవారికి సహాయ సహకారాలు అందించడంలో రోటరీ క్లబ్ సభ్యులు ముందుండాలని సామాజిక సేవ లోనే సంతృప్తి దాగుందని రోటరీ క్లబ్ ఎలక్టెడ్ గవర్నర్ త్రివిక్రమ్ జోషి పేర్కొన్నారు.ఆదివారం నంద్యాల పట్టణంలోని రోటరీ భవన్ లో జరిగిన మిడ్ టౌన్ రోటరీ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.మానవత్వం, పరోపకారం, సహకార గుణంతో సమాజాభివృద్ధికి రోటరీ క్లబ్ సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

నూతన అధ్యక్ష కార్యదర్శులు గా ఎంపికైన కేశవమూర్తి ,వెంకటేశ్వర్లు చేత త్రివిక్రమ్ జోషి ప్రమాణ స్వీకారం చేయించారు.రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ లు రామలింగారెడ్డి, శ్రీరామమూర్తి, చిన్నపరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ హరీష్ బాబు తదితరులు అతిథులుగా హాజరై సేవా కార్యక్రమాల ఆవశ్యకతపై ప్రేరణాత్మక సందేశం అందించారు.గత ఏడాది మిడ్ టౌన్ రోటరీ క్లబ్ చేసిన సేవా కార్యక్రమాల గురించి క్లబ్ మాజీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి కార్యదర్శి ప్రసాద్ లు వివరించారు.ముఖ్య అతిథులుగా హాజరైన త్రివిక్రమ్ జోషిని ,అసిస్టెంట్ గవర్నర్ హరీష్ బాబులను నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎంపికైన కేశవమూర్తి వెంకటేశ్వర్లు ను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు.సభ్యుల సహకారం చక్కటి ప్రణాళికతో ఈ ఏడాది మంచి సేవా కార్యక్రమాలు చేపడతామని నూతన అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో మిడ్ టౌన్ క్లబ్ మాజీ అధ్యక్షులు మురళీకృష్ణ,డి.వి .సుబ్బయ్య,చింతల మోహన రావు ,నెరవాటి రవికుమార్, గాంధీ,అన్నెం శ్రీనివాస రెడ్డి, శేష ఫణి తదితరులు పాల్గొన్నారు
Arattai