:అమరావతి 07-10-2025: పట్టణాల్లో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి నారాయణ అన్నారు…ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులు సకాలంలో పూర్తయ్యేలా మున్సిపల్ కమిషనర్లు చొరవ తీసుకోవాలని సూచించారు..మున్సిపల్ కమిషనర్లు,ఇంజినీర్లతో ఆ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మూడు రోజుల పాటు వర్క్ షాప్ జరుగుతుంది…ఈ వర్క్ షాప్ నకు మంత్రి నారాయణ హాజరయ్యారు

రాష్ట్రంలోని 77 మున్సిపాల్టీల కమిషనర్లు,ఇంజినీర్లతో మూడు రోజుల పాటు వేర్వేరుగా వర్క్ షాప్ జరగనుంది..మొదటి రోజు వర్క్ షాప్ నకు 29 మున్సిపాల్టీల నుంచి అధికారులు హాజరయ్యారు…పట్టణాల్లో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా చర్చించారు.2029 లోగా పూర్తి చేయాల్సిన అభివృద్ది ప్రాజెక్ట్ లపై అధికారులకు పలు సూచనలు చేసారు..ఆ తర్వాత పట్టణాభివృద్దిపై అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేసారు.

మున్సిపాల్లీల్లో ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణ,డ్రైనేజి,రోడ్లు,వీధి దీపాల నిర్వహణ పక్కాగా చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.రాష్ట్రంలో పేరుకుపోయిన లెగసీ వేస్ట్ 85 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే తొలగించగా….మరో 20 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ను డిసెంబర్ నెలాఖరుకు తొలగిస్తామన్నారు…జనవరి నుంచి ఘన వ్యర్ధాలు పూర్తిగా ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు…అలాగే ప్రస్తుతం ఉన్న రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల లకు అదనంగా కొత్తగా మరో 6 ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నామని…ఇవన్నీ పూర్తయితే రాష్ట్రంలోని మున్సిపాల్టీలు డంపింగ్ యార్డ్ రహితంగా మారతాయన్నారు.

మరోవైపు ద్రవ వ్యర్ధాల నిర్వహణ అత్యంత కీలకం అన్న మంత్రి నారాయణ….ప్రతిరోజూ ఇళ్లలో ఉపయోగించిన నీటితో పాటు వర్షపు నీరు కోసం కాలువల నిర్మాణం చేపడుతున్నామన్నారు…అమృత్ పథకం 2 ద్వారా మున్సిపాల్టీల్లో రాబోయే రెండేళ్లలో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించేలా ముందుకెళ్తున్నామన్నారు..ఇక డ్రైనేజిలు,రోడ్లు,వీధి దీపాల కోసం వివిధ పథకాల నిధులతో పాటు మున్సిపాల్టీల నిధులు వినియోగించాల్సి ఉందన్నారు.ప్రాధాన్యతా క్రమంలో ఈ అభివృద్ది పనులను పూర్తి చేయాలి..అమృత్,ఆసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్(AIIB),అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్(UIDF) నిధుల ద్వారా డ్రింకింగ్ వాటర్,డ్రైనేజి నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు.

మరోవైపు మున్సిపాల్టీల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం,ప్రస్తుత పరిస్థితిపైనా అధికారులకు పలు సూచనలు చేసారు…నిర్మాణాలు పూర్తవుతున్న ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు కేటాయించాలని ఆదేశించారు…వచ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేయాలని సూచించారు..బుధవారం,గురువారం మరికొన్ని మున్సిపాల్టీల అధికారులతో జరిగే వర్క్ షాప్ లోనూ మంత్రి నారాయణ పాల్గోనున్నారు.
ఈ వర్క్ షాప్ లో మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్,టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి,ప్రజారోగ్య విభాగం ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర రావు పాల్గొన్నారు.
Leave a Reply