భారత దేశ తొలి ఉప ప్రధానిగా, తొలి హోమ్ మినిస్టర్‌గా,ఉక్కుమనిషిగా, భారతరత్నగా చిరస్థాయిగా నిలిచిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మంగళవారం వెలుగోడులో జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మంగళవారం మై భారత్ – మేరా యువ భారత్ ఆధ్వర్యంలో వెలుగోడు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి హాజరయ్యారు. ఆమెకు మై భారత్ — మేరా యువ భారత్ జిల్లా యువజన అధికారి రాహుల్ గిరి రెడ్డి, నూలు నాగేశ్వరరావు, ప్రతాప్ ఆచారి, పురుషోత్తం గౌడ్, వీరబ్రహ్మం, సురేష్ కుమార్, తిరుపాల్ నాయక్ తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.

లిటిల్ ఏంజిల్స్, డి పాల్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంపీ శబరి ఆసక్తిగా వీక్షించారు.అనంతరం సర్ధార్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, “జాతీయ సమైక్యతా స్పూర్తికి ప్రతీక సర్ధార్ వల్లభాయ్ పటేల్. ప్రజలంతా భేదాభిప్రాయాలు పక్కన పెట్టి జాతీయ ఐక్యత భావంతో ముందుకు సాగాలి” అని తెలిపారు. లిటిల్ ఏంజిల్స్ పాఠశాల యాజమాన్యం డా. ఎం.ఎఫ్. ఇమ్మాన్యుయేల్, అప్పియా ప్రశాంత్‌లు ఎంపీకి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సభ్యులు సహా పలువురు అభిమానులు కూడా ఆమెను సన్మానించారు. ఎంపీ శబరి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీనగర్, పొట్టి శ్రీరాములు సెంటర్ మీదుగా భారీగా సాగింది.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బ్రహ్మం నాయక్, ప్రధానోపాధ్యాయులు మాలిక్ ఖాన్, మధు గౌడ్, సుబ్బయ్య, శ్రీనివాసులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లిటిల్ ఏంజిల్స్, మోడల్, డిపోల్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai