శుక్రవారం కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్ నందు ఓటర్ల జాబితా రూపకల్పనపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ మాట్లాడుతూ…. జిల్లాలో స్వచ్ఛమైన తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహాయ సహకారాలు అందజేయాలన్నారు.
ఓటర్ల జాబితాలో చనిపోయిన ఓటర్లు, మార్పులు, చేర్పులు, బూతు స్థాయి ఏజెంట్లతో పరిశీలించుకుని అభ్యంతరాలు ఉంటే ఈఆర్ఓ, ఏఆర్ఓలకు తెలియజేయాలని డిఆర్ఓ రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఒక పోలింగ్ స్టేషన్లో 12 వందల ఓటర్లు కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ బూతు నందు మరొక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల నుంచి అందిన 6, 7, 8 ఫామ్స్ పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని ఎన్నికల విభాగం అధికారులకు తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు సూచించిన అంశాలను ఎన్నికల సంఘానికి నివేదిస్తామని డిఆర్ఓ రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు
Arattai