నంద్యాల పట్టణంలోని స్పటిక లింగేశ్వర ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలను యోగానంద,పద్మశేఖర్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం స్పటిక లింగేశ్వరునికి రుద్రాభిషేకం పంచామృత అభిషేకం నిర్వహించారు. ఆచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అశ్వర్థ నారాయణ కళ్యాణం నిర్వహించారు.లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
సాయంత్రం స్పటిక లింగేశ్వర ఆలయంలో జ్వాలాతోరణం,లక్ష దీపోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమాల అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు
..
Arattai