అండర్ -14 బాలికల విభాగంలో శ్రీకాకుళం జిల్లాలో పలాసలో 8వ 9వ తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొని తమ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని అవంతి ప్రథమ స్థానం సాధించి జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ కు ఎంపికైనట్లు కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయుని పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకోటిరెడ్డి తెలిపారు.
జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థిని కి జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు M N విజయ భాస్కర్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.తిమ్మనాయుని పేట ఆకాంక్ష ఫౌండేషన్ నిర్వాహకులు విజయ్ కుమార్ నేతృత్వంలో ఆమె శిక్షణ పొందినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
Arattai