NANDYAL JAN12:-నంద్యాల విశ్వ హిందూ పరిషత్ మాతృ శక్తి విభాగం ఆధ్వర్యంలో సోమవారం ,టెక్కే మార్కెట్ యార్డు నందు సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 92 మంది మహిళలు ముగ్గులు వేశారు. విజేతలైనటువంటి వారికి మొదటి బహుమతి 5000 రూపాయలు, రెండవ బహుమతి 3000 రూపాయలు, మూడో బహుమతి 2000 రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంనకు ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు జిల్లెల్ల శ్రీదేవి,స్కూల్ అసిస్టెంట్ కంభం సుధా రెడ్డి,న్యాయ నిర్ణేతగా జిల్లా మాతృశక్తి సహ సంయోజిక, డాక్టర్ లలితా సరస్వతి ,కంభం సుధారెడ్డి వ్యవహరించారు. సఖి జువెలరీ అధినేత నరేంద్ర గారు పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు అందించారు.

వినూత్నంగా మహిళలచే కోలాట నృత్య ప్రదర్శన అత్యద్భుతంగా నిర్వహించామని విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు కాల్వ శేష సాయి గారు మురళీధర్ రెడ్డి ,సిరిగిరి కృష్ణ, నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, భరత్ కుమార్, పాల్గొన్నారు
Arattai