నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు అండర్గ్రాడ్యుయేట్ (UG) డిగ్రీ కోర్సులలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు శనివారం కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.ఇంటర్మీడియట్ విద్యార్థులు డిగ్రీలో చేరడానికి చివరి అవకాశమని తెలిపారు.
ఈ నేపథ్యంలో, డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాల కార్యాలయాన్ని వ్యక్తిగతంగా సంప్రదించాలని ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.

స్పాట్ అడ్మిషన్ కోసం దరఖాస్తు చేయదలిచిన విద్యార్థులు క్రింది పత్రాలను తప్పనిసరిగా తెచ్చుకోవాలి:
అర్హతలు :-ఇంటర్మీడియట్ మార్క్ మెమోలు / పాస్ సర్టిఫికేట్, ట్రాస్స్ఫర్ సర్టిఫికేట్ (TC) స్టడీ / రెసిడెన్స్ సర్టిఫికేట్ (లోకల్ స్టేటస్), కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే) EWS ధృవీకరణ పత్రం (ప్రస్తుత విద్యా సంవత్సరం 2025–26కు మాత్రమే వర్తిస్తుంది), ఆధార్ ఐడీ
ముఖ్య గమనిక:- APSCHE ఇచ్చిన స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారం మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు.
Arattai