ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహణలో, బకించంద్ర చటర్జీ వందేమాతరం గీతం వ్రాసి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల స్థాయిలో ఈనెల 30 వ తేదీ, ఆదివారం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో బకించంద్ర చటర్జీ ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.
టోర్నమెంట్ వివరాలను నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రవి కృష్ణ, రామ సుబ్బారెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు. టోర్నమెంట్ లో పోటీలను ఫీడే నిబంధనలకు అనుగుణంగా స్విస్ రౌండ్ పద్ధతిలో జరుగుతాయని తెలిపారు
విజేతలకు నగదు బహుమతులతో పాటు, ట్రోఫీలు,పతకాలు ప్రదానం చేస్తారు.
పాల్గొనదలచిన వారు ఈనెల 27వ తేదీ లోపు www.apchess.org వెబ్సైట్ ద్వారా ఎంట్రీలు నమోదు చేసుకోవాలి.
ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్:9010451585.
పవన్ కళ్యాణ్ రెడ్డి టోర్నమెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు.
Arattai