నంద్యాల ఐ.ఎం.ఏ. గత సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాలకు రాజంపేటలో జరిగిన 67వ ఆంధ్ర ప్రదేశ్ ఐఎంఏ రాష్ట్ర సదస్సులో ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ బానుశాలి నాలుగు పురస్కారాలు అందజేశారు.
మీడియం బ్రాంచ్ విభాగంలో నంద్యాల ఐఎంఏ కు ఉత్తమ శాఖ పురస్కారం, ఉత్తమ అధ్యక్షులుగా డాక్టర్ మధుసూదన రావు, ఉత్తమ సామాజిక సేవల పురస్కారం నంద్యాల ఐఎంఏ మహిళా విభాగానికి దక్కింది. ఐఎంఏ ప్రాంతీయ వైద్య వైజ్ఞానిక సదస్సు నంద్యాల ఐఎంఏ నిర్వహించినందుకు మరొక పురస్కారం అందజేశారు
ఈ పురస్కారాలను గత సంవత్సర కాలంగా నంద్యాల ఐఎంఏ అధ్యక్షులుగా పనిచేసిన డాక్టర్ మధుసూదనరావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ సహదేవుడు,ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హరిత,రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ వినోద్ కుమార్ లు కలిసి అందుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ ,డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో నంద్యాల ఐఎంఏ ద్వారా సామాజిక సేవలు, నిరంతర వైద్య విద్యా సదస్సులు, విద్యార్థి అవగాహన సదస్సులు, కళాశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు మొత్తం 146 కార్యక్రమాలు నిర్వహించామని వాటికి రాష్ట్ర ఐ ఎం ఎ గుర్తించి ఈ పురస్కారాలకు అవార్డ్స్ కమిటీ ఎంపిక చేసిందని అన్నారు.
భవిష్యత్తులో కూడా నంద్యాల ఐఎంఏ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ పురస్కారాలు అందుకున్న వారిని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి,నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ మహమ్మద్ రఫీ, సీనియర్ సభ్యులు డాక్టర్ సహదేవుడు తదితరులు అభినందనలు తెలిపారు.
Arattai