రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నంద్యాలలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలను నంద్యాలలోని నవజీవన్ బదిరుల పాఠశాల నందు వాలీబాల్ షాట్ పుట్ షటిల్ బ్యాట్మెంటన్ వీల్ చైర్ రేస్ 100 మీటర్స్ రన్ షాట్ ఫుట్ వంటి క్రీడలలో క్రీడా పోటీలు నిర్వహించారు.

ఇందులో విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క ప్రతిభ కనబరిచినారు ఇందులో గెలుపొందిన వారికి డిసెంబర్ మూడవ తేదీ టౌన్ హాల్లో జరిగే ప్రపంచ వివంగుల దినోత్సవం వేడుకలలో బహుమతి ప్రధానం చేయడం జరుగుతుంది. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ పాల్గొని పోటీలను ప్రారంభించారు. క్రీడలలో అత్యున్నత స్థాయికి చేరాలని తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని డాక్టర్ రవి కృష్ణ తెలిపారు.

జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని క్రీడాకారులకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి తన వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు.

ఈ పోటీలలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం.ఎన్.వి. రాజు ,జిల్లా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ రమణయ్య నవజీవన్ స్పెషల్ స్కూల్ కరస్పాండెంట్ సోషల్ వర్కర్ సిస్టర్ జాన్ మేరీ స్పెషల్ స్కూల్ ఫౌండర్ ఫాదర్ మర్రెడ్డి ,హెచ్ఎం మిస్సెస్ పద్మ పిఈటి సుంకన్న భాస్కర్ నవజీవన్ స్కూల్ సిబ్బంది మరియు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు సిబ్బంది పాల్గొన్నారు.
Arattai