నంద్యాల లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం
నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు సోమవారం గీతా జయంతి ఏకాదశి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. గాయత్రీ దేవి కుంకుమార్చన ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు దేవస్థానం నందు నిర్వహిస్తున్నట్లు నంద్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సూర్య ప్రకాష్ ఆచారి తెలిపారు
Arattai