నంద్యాల దంత వైద్యులు డా”కురుమేటి కిశోర్ కుమార్ కు ఐడిఏ జాతీయ దంత వైద్యుల పురస్కారం
NANDYAL Jan30 :- ఐడిఏ రాయలసీమ బ్రాంచి అధ్యక్షుడు,నంద్యాల పట్టణానికి చెందిన డాక్టర్ కిషోర్ కుమార్,జాతీయ దంత వైద్యుల పురస్కారం కు ఎంపికయ్యారు.
నంద్యాల సీనియర్ దంత వైద్యులు డా”కురుమేటి కిశోర్ కుమార్ గారు 2025 సం”లో ఐడిఏ రాయలసీమ బ్రాంచి ప్రెసిడెంట్ గా కర్నూలు, మంత్రాలయం,నంద్యాలలో వరల్డ్ డెంటిస్ట్ డే, వరల్డ్ ఓరల్ హెల్త్ డే, వరల్డ్ నో టొబాకో డే వంటి పలు దంత వైద్య శిబిరాలు,నోటి ఆరోగ్య పరిరక్షణ సదస్సులు,దంత వైద్యులకు వ్యక్తి గత ఆరోగ్య పరిరక్షణలో భాగంగా గుండె జబ్బుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,దంత వైద్యులకు ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీలోను,అలైనర్స్ లోను రాష్ట్ర స్థాయి శిక్షణా సదస్సులు నిర్వహించారు.

వీరి విశిష్ట సేవలకు గుర్తింపుగా 2026 ఫిబ్రవరి 7 వ తేదీన మంగళూరులో (కర్ణాటక) జరుగనున్న 76 వ ఐడిఏ జాతీయ దంత వైద్య సదస్సులో ఉత్తమ రాయలసీమ ప్రాంతీయ అధ్యక్షుడిగా ఐడీఏ జాతీయ దంత వైద్యుల పురస్కారం నాల్గవ సారి ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా నంద్యాల దంత వైద్యులు డా”సి.గురుప్రసాద్,డా”శ్రావణ కుమార్,డా”వరుణ్ కుమార్ రెడ్డి,డా”సునీల్ జాషువా, డా”ధనుంజయ రెడ్డి లు ఆత్మీయ సన్మానం చేశారు.గతంలో 2014,2015 మరియు 2020 సం”లలో డాక్టర్ కిషోర్ కుమార్ గారు మూడు ఐడిఏ జాతీయ పురస్కారాలు అందుకోవటం విశేషం.
Arattai