NANDYAL Feb 04:- ఇండియన్ డెంటల్ అసోసియేషన్ రాయలసీమ బ్రాంచి వారు ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా భారతీ బియిడి మరియు శ్రీశైల పబ్లిక్ స్కూల్ నందు నోటి కేన్సర్, మహిళల్లో వచ్చే సర్వైకల్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ స్త్రీ వ్యాధి నిపుణులు డా”బి.శిరీషా రెడ్డి గారు గర్భాశయ క్యాన్సర్ గురించి,డా”పి.గీతా వాణి గారు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి,డా”కె
కిశోర్ కుమార్ గారు నోటి కేన్సర్ గురించి మరియు డా”చాందినీ గారు పౌష్టికాహారం గురించి, ఒత్తిడిని ఎలా తగ్గించాలి అనే అంశాల గురించి విద్యార్థినిలకు,ఉపాధ్యాయులకూ అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల దంత వైద్యులు డా”సి.గురు ప్రసాద్,డా”జాషువా సునీల్,డా”వరుణ్ కుమార్ రెడ్డి, పాఠశాల పర్యవేక్షకులు శ్రీ కె.మురళీ కృష్ణా రావు, శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Arattai