NANDYAL:-శాంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి), నంద్యాలలో మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ ఉపయోగించి రియల్-టైమ్ డేటా ఆధారిత అప్లికేషన్ డెవలప్మెంట్ అంశంపై 24 గంటల హ్యాకథాన్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ హ్యాకథాన్‌లో మొత్తం *10 సమస్యా ప్రకటనలు ఇవ్వగా, *26 టీములు పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఇలాంటి హ్యాకథాన్లు విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యాలు, టీమ్‌వర్క్ మరియు ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయని తెలిపారు. రియల్‌టైమ్ సమస్యలపై పని చేసే అవకాశాలు విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేస్తాయని ఆయన అన్నారు.

ఈ హ్యాకథాన్‌ను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్) విభాగాధిపతి డా. ఎన్. రమాదేవి గారి మార్గదర్శకత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మెషిన్ లెర్నింగ్ మరియు డీప్ లెర్నింగ్ ఆధారిత అప్లికేషన్ అభివృద్ధిపై విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం కల్పించడమే ఈ హ్యాకథాన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ హ్యాకథాన్‌కు ఇండస్ట్రీ నిపుణులు మరియు ఎవాల్యుయేటర్‌గా రిషి ఆర్ మరియు విజయలక్ష్మి గంగుల టీముల ప్రాజెక్టులను మూల్యాంకనం చేసి విలువైన సూచనలు అందించారు. 24 గంటల పోటీలో ప్రతిభ చూపిన 5 టీములను విజేతలుగా ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం మరియు పరిశ్రమ అవగాహనను మరింత పెంచిందని కళాశాల యాజమాన్యం పేర్కొంది.
Arattai