NANDYAL Mar29:- నంద్యాల,ప్రధమనంది దేవస్థానం నందు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టం నమూనా బిల్లుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టం నమూనా బిల్లును ఈరోజు నగరంలోని ప్రథమ నంది దేవస్థానంలో జిల్లాలోని ప్రముఖులకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం అయినది.
పూజ్య స్వామీజీ అభినవ శంకరానంద స్వామి మాట్లాడుతూ దేవాలయ నిర్వహణ పూర్తిగా హిందువులే చేసుకోబోతున్నారని,
చిన్న ఉద్యోగం నుంచి పెద్ద స్థాయిలో ఉండే బాధ్యత వరకు అందరూ హిందూ సంప్రదాయాన్ని ఆచరించే వారు ఉండబోతున్నారని,అన్యమతస్తులకు ఏమాత్రం తావులేని వ్యవస్థ ఏర్పాటు అవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు మాలిగి వ్యాసరాజు మాట్లాడుతూ దేవాదాయ శాఖ స్థానంలో రాజ్య దార్మిక పరిషత్ ను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ రాజ్య ధార్మిక పరిషత్ ద్వారానే భవిష్యత్తు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల యొక్క కార్యకలాపాలు జరగబోతున్నాయని తెలిపారు.రాజ్య ధార్మిక పరిషత్ తర్వాత జిల్లా ధార్మిక పరిషత్తు మరియు ఆలయధార్మిక పరిషత్తు ఉంటాయని కేవలం ఈ మూడు స్థాయిలలోనే దేవాలయం ఉండబోతుందని,
ఇది చాలా సరళతరమైనదని వారు తెలిపారు.
విశ్వహిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజ్య ధార్మిక పరిషత్ ఏర్పడిన తర్వాత అన్యాక్రాంతమైన దేవాలయ స్థలాలను ఆస్తులను తిరిగి దేవాలయమున అప్పజెప్పే ప్రయత్నం చేస్తుందని రాజకీయ నాయకుల జోక్యం ఇకమీదట దేవాలయాల్లో ఉండబోదని వారు స్పష్టం చేశారు.
విశ్వహిందూ పరిషత్ నంద్యాల జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్ గారు మాట్లాడుతూ రాజకీయాల్లో క్రియాశీలంకంగా పనిచేసే వారికి గ్రామ సర్పంచి నుండి పార్లమెంటు మెంబర్ దాకా ఏ పదవిలో ఉన్నా కూడా దేవాలయ కమిటీల్లో ఇకమీదట ఉండబోరని వారు బలంగా చెప్పారు..
ఈ కొత్త చట్టంలో ఎటువంటి రాజకీయాలు గాని ఏ ఆధ్యాత్మిక సంస్థల యొక్క ప్రమేయం గాని ఉండబోదని వారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ అభినవ శంకరానంద స్వామి,ప్రాంత ఉపాధ్యక్షులు మాలిక వ్యాసరాజు జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి ,జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్ మరియు జిల్లాలోని అర్చకులు, పురోహితులు,న్యాయవాదులు, మరియు విశిష్ట వ్యక్తులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
Arattai