NANDYAL Apr 02:- గురువారం పార్లమెంట్ లో అమరావతి రాజధానిగా బిల్లు అనుమతి పొందిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమరావతి సంబరాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

అందులో భాగంగా నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు అమరావతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందము అలాగే విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి రాజధాని అఫీషియల్ గా అనుమతి పొందిన సందర్భంగా ఈ ప్రత్యేకతను సంతరించుకొని కేక్ ను కట్ చేయడం జరిగిందని తెలిపారు.
Arattai