NANDYAL Apr 02:- నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసిన అమ్మ స్పటిక లింగేశ్వరాలయం నందు గురువారం చైత్ర మాస పౌర్ణమి పురస్కరించుకుని నిర్వాహకులు యోగనంద ఆధ్వర్యంలో స్ఫటిక లింగేశ్వర స్వామి కి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృతాభిషేకం,అనంతరం లోక కళ్యాణార్థం శాంతిహోమాలు నిర్వహించి పూర్ణాహుతి గావించరు.

అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.ప్రతినెలలో వచ్చే పౌర్ణమి రోజున లోక కళ్యాణ అర్థం హోమాలు నిర్వహిస్తుంటామని నిర్వాహకులు యోగానంద తెలిపారు.ఈ కార్యక్రమంలో తిమ్మయ్య,గాంధీ,శంకర్ రెడ్డి, రఘునాథరెడ్డి, యోగ సభ్యులు పాల్గొన్నారు

Arattai