NANDYAL April 19 :- ఆదివారం నంద్యాలలో స్థానిక హోటల్ ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ వర్కింగ్ కమిటీ సమావేశం, నంద్యాల ఐఎంఏ నిర్వహణలో ఏర్పాటు చేశారు.ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుబాటి శ్రీహరి, రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ బాలరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు.

ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎస్ బాలరాజు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఐఎంఏ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఐఎంఏ నాయకులు పాల్గొన్నారు.ఐఎంఏ అసోసియేషన్ బలోపేతానికి తీసుకోవలసిన చర్యల పట్ల,వైద్యుల సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేయాలి, ఐఎంఏ సభ్యుల సంక్షేమానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి సుదీర్ఘంగా చర్చించారు.

ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు మాట్లాడుతూ ఐఎంఎలో ప్రైవేటు వైద్యులు, ప్రభుత్వ వైద్యులు సభ్యులుగా ఉన్నారని, రాష్ట్రంలోని 100 శాఖలలో 22 వేల మంది పైగా సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐఎంఏ కృషి చేస్తుందని ప్రకటించారు. వైద్యం పొందుతున్న రోగులు వ్యాధి తీవ్రత వలన మరణించిన సమయాల్లో వైద్యులపై, ఆసుపత్రులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయని, ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయమని అన్నారు. వైద్యులపై దాడులు పెరిగితే అత్యవసర కేసులు చూడడానికి వైద్యులు వెనకంజ వేసే పరిస్థితి వస్తుందని అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ వైద్యుల 2008 రక్షణ చట్టం సవరించి వైద్యులపై, ఆసుపత్రులపై దాడి చేసే వారికి కఠిన శిక్షలు విధించే విధంగా ప్రస్తుత చట్టాన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం విషయంలో ఆసుపత్రిలో ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలన్నారు. వైద్యుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రభుత్వానికి వినతి పత్రం అందజేస్తామన్నారు.ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ వైద్యులు వైద్య వృత్తిని నైతిక విలువలతో, నిబద్ధతతో కొనసాగించాలని కోరారు.

సమావేశం అనంతరం రాష్ట్ర నాయకులను నంద్యాల ఐఎంఏ తరపున డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ పనిల్ కుమార్, నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మహమ్మద్ రఫీ, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ వసుద ,డాక్టర్ హరిత ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ త్యాగరాజ రెడ్డి, డాక్టర్ నాగళ్ళ కిషోర్, డాక్టర్ అశోక్, డాక్టర్ బాల మద్దయ్య, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ ప్రసాద్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శిలు డాక్టర్ ఫణి ధర్, డాక్టర్ రెహమాన్, నంద్యాల ఐఎంఏ నాయకులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, రాష్ట్ర ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ సుబ్బారెడ్డి, డాక్టర్ మధుసూదన శర్మ, సంయుక్త కార్యదర్శులు డాక్టర్ పనిల్ కుమార్, డాక్టర్ జంధ్యాల శివకుమార్, డాక్టర్ సునీల్, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Arattai