NANDYAL April14 :- “వరల్డ్ లివర్ డే” సందర్భంగా నంద్యాల పట్టణంలో స్పెషల్ హెల్త్ ప్యాకేజీ ద్వారా రాయితీతో వైద్య సేవలు అందిస్తున్న గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి ని “మిడ్ టౌన్ రోటరీ క్లబ్ “ఆదివారం ఘనంగా సత్కరించింది.. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కేశవమూర్తి ,వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పద్మావతి నగర్ లోని” ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్”లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ఉప విద్యాధికారి డిటి శంకర్ ప్రసాద్, మహానంది మండల విద్యాధికారి రామసుబ్బయ్య పాల్గొన్నారు.. ఈ సందర్భంగా శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాలలో అత్యాధునిక ఎండోస్కోపి మరియు కొలనోస్కోపీ సేవలు లభించడం అభినందనీయమన్నారు.

డాక్టర్ ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ వ్యాయామము, ఆహారపు అలవాట్లు ద్వారా కాలేయం ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మద్యపానానికి దూరంగా ఉండాలని పండ్లు, కాయగూరలు తీసుకోవాలని సూచించారు. కాలేయం పట్ల అవగాహన పెంచుకోవాలని, అప్రమత్తత కొరకు లివర్ ఫంక్షన్ టెస్ట్ ,ఫైబ్రోస్కాన్ తదితర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు అన్నెం శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరు సుబ్రమణ్యం, శేషఫణి, మహబూబ్ బాషా, అపస్ జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
Arattai