కుమ్మరి కులవృత్తిని బ్రతికించండి- చాగంటి కోటేశ్వరరావుకు వినతి
NANDYAL April19 :- అంతరించిపోతున్న కుమ్మరి కులవృత్తిని బ్రతికించాలని కోరుతూ ప్రముఖ ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావును నంద్యాల జిల్లా కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆదివారం సాయంత్రం కలిశారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి వెల్పేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాముడు, గురునాథ్, సూర్యనారాయణలు చాగంటి కోటేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు.మన ఊరు మన గుడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు వచ్చిన ఆయనను కలసి కుమ్మరి వృత్తిని కాపాడేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.వారు మాట్లాడుతూ హైందవ ధర్మంలో మానవుని మనుగడలో కుమ్మరి కుండ మొక్క ప్రాముఖ్యతను ప్రవచనాల్లో సందర్భానుసారంగా చెప్పాలని కోరామన్నారు. భగవంతునికి నైవేద్యం సమర్పించేందుకు కుండ అవసరమన్నారు. గ్రామ దేవలకు బోనం సమర్పించేందుకు కుండ అవసరమన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకేశ్వర స్వామికి ప్రతి నైవేద్యాన్ని కుమ్మరి కుండలోనే సమర్పిస్తారన్నారు. మానవుని జీవన విధానంలో ప్రతి ఒక్కరు శుభ కార్యాల్లో పెళ్లిళ్ళకు కుమ్మరి కుండను,అంత్యక్రియలకు కుండలను ఉపయోగిస్తారన్నారు. పూజా కార్యక్రమాల్లో మట్టి ప్రమిదలను ఉపయోగిస్తారన్నారు. కుమ్మరి కుండలో భోజనం తయారు చేసి తిన్నా, మట్టికుండలోని నీళ్ళు త్రాగినా చాలా మంచిందన్నారు. హిందూ సమాజాన్ని తట్టి లేపుతున్న చాగంటి కోటేశ్వరరావు వారి ప్రసంగంలో ప్రస్థావించాలని కోరామన్నారు. అప్పుడే కుమ్మరి కులవృత్తి దారులకు తగిన గుర్తింపు, జాతి మొక్క ఔదార్యం సమాజంలో మరింత కీర్తింపబడతాయన్నారు. గురువర్యులు స్పందిస్తూ సమాజ హితం కోసం మీరు అభ్యర్థించిన కోరికను నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.
Arattai