అమర యోగ వికాస కేంద్రంలో వరుణ హోమం
NANDYAL July29 :- నంద్యాల పట్టణంలోని అమర యోగ వికాస కేంద్రం నందు గురు పౌర్ణమి వేడుకలను నిర్వాహకులు యోగా నందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

వేదవ్యాసునికి,యోగా,ఆధ్యాత్మిక గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృతాభిషేకం,గురు మంత్ర జపం చేశారు.లోకకల్యాణార్థం,సకాలంలో వర్షాలు కురవాలని ఆశిస్తూ వరుణ హోమం నిర్వహించారు. అంతరం అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాంధీ తిమ్మయ్య అనిల్ యోగ సభ్యులు పాల్గొన్నారు
Arattai