NANDYAL :- నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చౌడేశ్వరి దేవస్థానం నందు మార్కండేయ.ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భీమనపల్లె వెంకటసుబ్బయ్య ,చెన్న వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రతిభకు పట్టాభిషేకం కరపత్రం ఆవిష్కరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు తమ యొక్క మార్కుల జాబితాను మే10-తేదీ లోపల నంద్యాల పట్టణం సంజీవనగర్లోని శ్రీ భద్రావతి భావనా ఋషి దేవాలయ కళ్యాణ మండపం నందు అందజేయాలని నిర్వాహకులు తెలిపారు.

పదవ తరగతిలో 540 పైన మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ 900 పైన మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మొదటి బహుమతి 10వేల రూపాయలు రెండవ బహుమతి 7500 మూడవ బహుమతి 5000 రూపాయలు కన్సోలేషన్ బహుమతులు 2000 రూపాయలు మరియు ప్రశంసా పత్రములు ఇవ్వడం జరుగుతుందనీ తెలిపారు. కావున ప్రతిఒక్క పద్మశాలి విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ కోరారు.

ఈ కార్యక్రమంలో చెన్నా వెంకటేశ్వర్లు, పుత్తా రామకృష్ణ , కోటా బాల వెంకటసుబ్బయ్య, గాజుల శంకర్ గుద్దేటి వెంకటరామయ్య. చెన్నా శ్రీనివాసులు ఉద్దంటి వెంకట సతీష్ మద్దాల మోహన్ గాజుల బ్రహ్మయ్య శ్రీనివాసులు దోమల చక్రపాణి చింతల పల్లె వాసు పల్లెఈశ్వరయ్య గాజుల పుల్లయ్య, కూడపు సుబ్రహ్మణ్యం కోడి పరమేశ్వరుడు, రంగా వేణుగోపాల్ ,పున్నా జయప్ప, గుర్రం శ్రీనివాసులు గాజుల వీరయ్య తదితరులు పాల్గొన్నారు
Arattai