MANGALAGIRI :- విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గునిశెట్టి శ్రీనివాసులు, ఎస్.ఎం.షరీఫ్, ఆర్ జేయుపి ప్రతినిధులు మదన సుధాకర్, సురేష్ సోమవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీమతి తమీం అన్సారియా గారిని మంగళగిరిలోని కమీషనరేట్ కార్యాలయంలో కలిసి ప్రాతినిధ్యం చేసి పరిష్కరించాలని కోరినట్లు నంద్యాల జిల్లాకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్తోజు వీరబ్రహ్మం పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కమిషనర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

అంతకు ముందు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. 2025 జూన్ లో బదిలీ పొంది రిలీవ్ కానీ ఉపాధ్యాయులను తక్షణమే రిలీవ్ చేయాలని, ఆప్షనల్ హాలిడేస్ పాఠశాల మొత్తానికి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, పదవ తరగతి వందరోజుల ప్రణాళికలో భాగంగా సెలవు రోజుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సీసీఎల్ మంజూరు చేయాలని తదితర డిమాండ్లను తమ సంఘం కమిషనర్ దృష్టికి తీసుకువచ్చినట్లు వీరబ్రహ్మం తెలిపారు.
Arattai