NANDYAL May01 :- నంద్యాల పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన షాహి జామియా మర్కజ్ మసీదులో మౌలిక వసతుల కల్పన మరియు సమగ్ర అభివృద్ధి పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల ఆర్థిక, సామాజిక మరియు విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని . ప్రార్థనా మందిరాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులను కల్పించేందుకు నిధులను మంజూరు చేశామని తెలిపారు.

షాహి జామియా మర్కజ్ మసీదును నంద్యాల పట్టణంలోనే ఒక ఆదర్శవంతమైన కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని తెలిపారు . కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా, మైనార్టీల కోసం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు

ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర యువనాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నీటి సంఘాల చైర్మన్ చాబోలు ఇలియాస్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ గుర్రప్ప, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియర్ ఖలీల్, ఇమాముల సంఘం అధ్యక్షులు అంజద్ భాషా సిద్ధికి, మిద్దె ఉసేని మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

V.రాజేంద్ర కుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai