NANDYAL May01 :- నంద్యాల పట్టణం లోని రామకృష్ణ కళాశాల యందు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ విద్యా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆచార్య ప్రశిక్షణ వర్గ -2026 కార్యక్రమాన్ని మాజీ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో దేశం మొత్తంలో 26 వేల పాఠశాలలు 36 లక్షల మంది విద్యార్థులు జాతీయ విద్యా విధానం ద్వారా విద్యను అభ్యసిస్తున్నారని వీటికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లాలలో 180 విద్యాలయాలలో విద్యార్థులకు సమగ్ర వికాసం మరియు వ్యక్తిత్వ నిర్మాణం విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి మంచి విద్యార్థులను అందిస్తూ విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తుందని తెలిపారు.

అందులో భాగంగా విద్యా భారతి ఆంధ్ర ప్రదేశ్ ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు 15 రోజులపాటు అనగా మే ఒకటో తేదీ నుండి మే 16 తేదీ వరకు ప్రశిక్షణ(teacher training,) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు

V.రాజేంద్ర కుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai