NANDYAL June02:- నంద్యాలలోని జిల్లా వైద్య అధికారి కార్యాలయం నందు పిసిపిఎన్డిటి కమిటీ మీటింగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆర్ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే నిర్వాహకుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటుజైలు శిక్షతప్పదని హెచ్చరించారు

చట్ట ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం ప్రోత్సహించడం నేరమన్నారు. సమాజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆడబిడ్డ ముఖ్యమని ఆడబిడ్డను రక్షించే బాధ్యత సమాజంలోని ప్రతి పౌరునికి ఉందని తెలియజేశారు స్కానింగ్ సెంటర్లలో ధరల బోర్డులు ప్రదర్శించాలని సూచించారుఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లైన డాక్టర్ శ్రవణ్ కుమార్ రేడియాలజిస్ట్, డాక్టర్ లక్ష్మీనారాయణ చిన్నపిల్లల వైద్యులు, డాక్టర్ సలీమున్నీసా బేగం గైనకాలజిస్ట్, జిల్లా మాస్ మీడియా అధికారి మల్లేపల్లి పామన్న, బర్డ్స్ , మరియు మదర్ సొసైటీ స్వచ్ఛంద ప్రతిని దులు, వంశీ పాల్గొన్నారు.
Arattai