NANDYAL June02:- రాయలసీమ ప్రాంత యాదవులకు రాజ్యసభలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ ఒక రాజ్యసభ సీటును కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ నంద్యాల జిల్లా నాయకులు తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా యాదవ నాయకులు మాట్లాడుతూ, యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ యాదవులకు రాజ్యసభ సీటు కేటాయించాలని కోరారు. ఆ సీటుకు మాజీ ఎమ్మెల్సీ, మాజీ జెడ్పీ చైర్మన్, అనంతపురం జిల్లా ప్రముఖ యాదవ నాయకుడు గుండుమల్ల తిప్పయ్య స్వామి యాదవ్ అర్హుడని పేర్కొన్నారు.

యాదవులు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచీ అండగా నిలుస్తూ వస్తున్నారని, యువత కూడా పెద్ద సంఖ్యలో పార్టీతో అనుబంధం కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి సమయంలో యాదవ సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు కేటాయించడం ద్వారా వారి మనోధైర్యాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంపై సానుకూలంగా స్పందించి, గుండుమల్ల తిప్పయ్య స్వామి యాదవ్‌ను రాజ్యసభకు పంపించేలా తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి ఫౌండర్ చైర్మన్ డాక్టర్ చింతల మోహన్ రావు యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు, శ్రీకృష్ణ టెంపుల్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విజయ గౌరీ యాదవ్, చంద్రుడు యాదవ్, కాజా శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాసరావు, మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Arattai