NANDYAL June25 :- నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు ఈనెల 29వ తేదీ నుండి ఇంగ్లీష్ విభాగం ఆధ్వర్యంలో Fluent Future పేరిట 30 గంటల ఉచిత ఇంగ్లీష్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శశికళ తెలిపారు.ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీలో చేరబోయే విద్యార్థిని విద్యార్థుల కోసం ఈ కోర్సును రూపొందించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.

విద్యార్థులకు ఉన్నత విద్యపై స్పష్టమైన అవగాహన కల్పించడం డిగ్రీ సర్టిఫికెట్లు కోర్సుల ఎంపిక కెరీర్ అవకాశాలపై మార్గదర్శకత్వం ఇవ్వడంతో పాటు నేటి పోటీ ప్రపంచానికి అవసరమైన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అందించడం దీని ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపాల్ తెలిపారు. 30 గంటల వ్యవధిలో స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ లో కీలకమైన అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు అంతేకాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ప్రత్యేక ప్రాధాన్య ఇవ్వబడుతుందని తెలిపారు.కమ్యూనికేషన్ స్కిల్స్ ,పబ్లిక్ స్పీకింగ్ ఇంటర్వ్యూ టెక్నిక్స్ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అంశాలపై ప్రాక్టికల్స్ స్టేషన్స్ నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులు ఈ సర్టిఫికెట్ కోర్సులు చేరడానికి ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు కళాశాల కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
Arattai