NANDYAL June 30 :- నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రాపిడ్, బ్లిట్జ్ చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి.నంద్యాల జిల్లా చెస్ సంగం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, దీని ప్రగతి రెడ్డి, వైద్యులు డాక్టర్ రఘునాథ రెడ్డి అతిథులుగా పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఇప్పటిలో విజేతలుగా నిలిచిన వారు నంద్యాల జిల్లా తరఫున రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చదరంగం పోటీలు జిల్లాలో తరచూ నిర్వహించడం ద్వారా జిల్లాలో చదరంగం ప్రాచుర్యం బాగా పెరిగిందని నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వాహకులను అభినందించారు. వచ్చే నెల 18, 19వ తేదీలలో రామకృష్ణ పిజి కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సీనియర్ చెస్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు.
జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు, శిక్షకులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Arattai