NANDYAL July01 :-నంద్యాల పట్టణంలో జాతీయ చార్టెడ్ అకౌంటెంట్ డే సందర్భంగా స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో కళాశాలలోని డిగ్రీ విద్యార్థిని/విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సభాధ్యక్షులుగా కళాశాల చైర్మన్ డాక్టర్ G. రామకృష్ణారెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల చార్టెడ్ అకౌంటెంట్ పాలూరు గోపికృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా చార్టెడ్ అకౌంటెంట్ పైన కళాశాల విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ తమ ప్రసంగంలో గోపికృష్ణ మాట్లాడుతూ నేటి ఆధునిక యుగములో కామర్స్ విభాగం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది, చార్టెడ్ అకౌంటెంట్ వంటి అంశాలు మనకు అవగాహన కలిగి ఉంటే జనరల్ మేనేజ్మెంట్ తో పాటు వ్యాపారం తదితర అంశాలలో చార్టెడ్ అకౌంటెంట్ ప్రాధాన్యత ఎంతో ఉంది, ఈ మధ్యకాలంలో జీఎస్టీ అనేది వింటూ ఉన్నాము జీఎస్టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి జిఎస్టిని వసూలు చేయడం వలన రాష్ట్రాలు, దేశము ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, కాబట్టి కళాశాల విద్యార్థులు డిగ్రీ తర్వాత సిఏ చదవటానికి ఆసక్తిని చూపించాలి అందరూ చాలా కష్టం అనుకుంటారు కానీ కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని అవగాహన కలిగిస్తూ విద్యార్థులు అడిగిన అనేక సందేహాలకు నివృత్తి చేస్తూ తమ ప్రసంగాన్ని కొనసాగించారు.

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో కామర్స్ విభాగం చాలా ప్రాధాన్యత ఉన్న విభాగమని ప్రతి సంవత్సరము 300 పైన విద్యార్థులు కామర్స్ విభాగంలో చేరుతున్నారని కాబట్టి స్టూడెంట్స్ కు, సమాజానికి, దేశానికి ఎంతో ఉపయోగపడే సబ్జెక్టు కామర్స్ అని చెప్పారు, ఇట్లాంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థులకు కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్ డే ను జరుపుతూ ఉన్నామని ఇప్పుడు జాతీయ విద్యా విధానంలో అనేక మార్పులు వచ్చాయని విద్యార్థులు అది గ్రహించాలని అన్నారు, మనకు వేదాలలో అన్ని శాస్త్రాలతో పాటు కామర్స్ శాస్త్రాలు సమాచారం కూడా ఉంది అని చెప్పారు కౌటిల్యుని అర్థశాస్త్రం వాడికి అంశాలు రాజుల కాలంలో ధనాగారం కోషాగారం ఇందుకు నిదర్శనం అని అన్నారు. వీటిని నిజమైన తదితరు అంశాలు ప్రాచీన భారతీయ సంస్కృతిలో రాజ్య పాలనలో కోశాగారము ఎలా నిర్వహించాలి అనే అంశాలు ఎంతో శాస్త్రీయంగా ఉన్నాయని నేడు కామర్స్ వాటి నుండి వచ్చిందని తెలియజేశారు. కాబట్టి విద్యార్థులు డిగ్రీ తర్వాత సిఏ వంటి కోర్సులు చదివి ఉన్నతమైన స్థానంలోకి రావాలని తమ కళాశాల పూర్వ విద్యార్థి పాలూరు గోపికృష్ణ ఈరోజు నంద్యాల పట్టణంలో గొప్ప చార్టెడ్ అకౌంటెంట్‌గా ఉంటూ మంచి ఆదరణ పొందుతూ ఉన్నత స్థానంలో ఉన్నారని ఇది తమకు సంతోషాన్ని కలిగిస్తుందని అలాగే విద్యార్థులైన మీరు ఉన్నతమైన చదువులు చదివి గొప్పగా ఎదగాలని మీరు కూడా ఇలాగా ముఖ్య అతిథులుగా కళాశాలకు రావాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కేబీవి సుబ్బయ్య మాట్లాడుతూ కామర్స్ విభాగం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు అవగాహన ఏర్పరచుకొని స్ఫూర్తిని పొందాలని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి అయిన శ్రీ పాలూరు గోపికృష్ణను కళాశాల యాజమాన్యం కామర్స్ విభాగం వారు శాలువా మెమెంటో తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగం అధిపతి డాక్టర్ డి.పుల్లయ్య, సత్యనారాయణ, మస్తాన్, శేఖర్, మద్దిలేటి, బాలచంద్రుడు, డాక్టర్ లలితా సరస్వతి మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు, జాతీయ గీతంతో కార్యక్రమము ముగిసింది.
Arattai