NANDYAL July03:- జిల్లా అభివృద్ధిలో సోషల్ మీడియా ఇన్ఫియెన్సర్ల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జిల్లా అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…. నంద్యాల జిల్లాలో అతి పురాతనమైన పుణ్యక్షేత్రాలు అహోబిలం, నవనందులు, యాగంటి, మహానంది, ఓంకారం, శ్రీశైలం, అహోబిలం, మద్దిలేటి స్వామి టెంపుల్, నందవరం చౌడేశ్వరిదేవి టెంపుల్, కొత్తూరు సుబ్బరాయుడు టెంపుల్ వంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నారు. మన పుణ్యక్షేత్రాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొనే విధంగా సోషల్ మీడియా ప్రమోట్ చేయాలన్నారు.నంద్యాల జిల్లాలో 49 వేల పైచిలుకు హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేయడం జరుగుతుందన్నారు. ఇందులో ముఖ్యంగా ఖర్జూరం, ఆపిల్, డ్రాగన్ ఫ్రూట్స్ జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగు చేయడం జరుగుతుందని వీటి మీద కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అప్రోచ్ లో హార్టికల్చర్ అగ్రికల్చర్, పశుసంవర్ధక శాఖ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించిన యాక్టివిటీస్ పై అవగాహన కల్పించాలన్నారు.జిల్లాలోని వెలుగోడు రిజర్వాయర్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి ప్రమోట్ చేయాలన్నారు.నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్కరూ పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాను గ్రీన్ ఎనర్జీగా తీర్చిదిద్దేందుకు సోషల్ మీడియా కృషి చేయాలన్నారు. ఈ పథకం ద్వారా ఆదాయం పెరగడంతో పాటు పొల్యూషన్ నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకునేందుకు దోహదపడుతుందన్నారు. ఒకసారి ఇంటి పై కప్పులపై సోలార్ ప్యానల్ పెట్టుకుంటే 25 ఏళ్ల వరకు విద్యుత్ సమస్య ఉండదన్నారు. ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయితే ప్రభుత్వానికి అమ్మవచ్చు కరెంటు పోతుందనే టెన్షన్ ఉండదు పీఎం సూర్య ఘర్ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.నంద్యాల జిల్లాలో 4,లక్షల మంది స్వయం సహాయక సంఘ సభ్యులు ఉన్నారని వీరి చేతివృత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లి వీరికి మరింత జీవనోపాధి కలిగించే విధంగా సోషల్ మీడియా ప్రచారం చేయాలన్నారు.
నంద్యాల జిల్లాలో రాంకోస్ సిమెంటు ఫ్యాక్టరీ విస్తరణ పనులు మరియు అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ లాంటి మెగా ఫ్యాక్టరీల వలన జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
జలధార జల హారతి మరియు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రీమియర్ ద్వారా వచ్చే ఫలితాలను కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రధానమంత్రి ప్రసంసించిన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను తదితర ఫుడ్ డ్రస్సింగ్ యూనిట్లను మరియు నల్లమల హనీని, నన్నారిని పాండురంగాపురం జిప్ బ్యాగుల పై ప్రజలకు అవగాహన కల్పించాలి.
Arattai