NANDYAL July05 :- నంద్యాల సంజీవనగర్ లో డాక్టర్ సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కె.వి.ఆర్ ఆసుపత్రిలో నూతనంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ జయ రామ కృష్ణ ఆధ్వర్యంలో ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ విభాగం, నవజాత శిశు మరియు చిన్న పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ నిత్య ఆధ్వర్యంలో నియోనేటల్ , చిన్నపిల్లల క్రిటికల్ కేర్ యూనిట్ ఆదివారం ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు,మాజీ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ప్రారంభించారు.

డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ నాగమణి,డాక్టర్ అనిల్,డాక్టర్ పనిల్ కుమార్ ఓ పి డి విభాగం, న్యూరాలజీ వార్డ్, నియోనేటల్, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్ విభాగాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ జయ రామకృష్ణ, డాక్టర్ నిత్య మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు, వసతులతో ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ కేంద్రంలో పక్షవాతం వచ్చిన వారికి చికిత్సలు,నవజాత శిశువుల, చిన్నపిల్లల క్రిటికల్ కేర్ సేవలు అందిస్తామన్నారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాలలో అత్యాధునిక వసతులతో న్యూరాలజీ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. అనేకమంది వైద్యులు అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు నంద్యాలలోనే అందిస్తున్నారని,కర్నూల, హైదరాబాదు నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలు ఇక్కడే వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ రామ సుబ్బారెడ్డి, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ తనూజ, డాక్టర్ వసుధ, డాక్టర్ మాధవి, డాక్టర్ రాకేష్ రెడ్డి అధిక సంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు.
Arattai