NANDYAL July16 :- నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం నందు గల రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్ నందు రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి గాను, ఒక సంవత్సరం పార్ట్ టైం యోగా పీజీ డిప్లమా కోర్సు కు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు గురువారం యోగ చైతన్య కేంద్ర సెక్రెటరీ దామోదర కుమార్ రెడ్డి తెలిపారు
ఈ సందర్భంగా దామోదర కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో యోగా శిక్షకులకు మంచి ఆదరణ ఉందని కావున ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు పీజీ డిప్లమా ఇన్ యోగ కోర్సు కు అర్హులని,జూలై 25వ తేదీ లోపల www.yctnandyal.org అనే వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఆగస్టు 2వ తేదీన కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.మరిన్ని వివరములకు టెక్కే భరతమాత గుడి వీధి లోని రాపర్తి రామ అకాడమీ ఆఫ్ యోగిక్ సైన్సెస్, యోగ చైతన్య కేంద్రం నందు కానీ లేదా 8919771823 అనే నంబర్ ను సంప్రదించాలని కోరారు తెలిపారు.ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు
Arattai