ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
HYDERABAD July18 :- కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు.

హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన శ్రీ లోకేష్ గారు విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.

Arattai