NANDYAL:- నంద్యాల పట్టణంలో గంగమ్మ తల్లికి నంద్యాల జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. పెద్దబండ ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా గ్రామోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Arattai