NANDYAL July20 :- విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర ప్రాంత అధ్యక్షులుగా నంద్యాల పట్టణానికి చెందిన యర్రం విష్ణువర్ధన్ రెడ్డిని నియమించినట్లు అఖిల భారత ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్డా తెలిపారు.యర్రం విష్ణు వర్ధన్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నగర అధ్యక్షులు,జిల్లా కార్యధ్యక్షులు,జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంత ఉపాధ్యక్షులుగా అనేక బాధ్యతలు నిర్వర్తించి కార్యకర్తలకు ప్రతి విషయంలో అండగా ఉంటూ మంచి పేరును సంపాదించారు

విజయవాడ లో హైందవ శంఖారావం పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కో కన్వీనర్ గా ఉంటూ ఆ సభను విజయవంతం చేయడంలో విశేషమైన పాత్ర పోషించారు.నంద్యాల వాసిగా నంద్యాల జిల్లా కేంద్రంలో దాతల సహాయంతో కార్యాలయం నిర్మాణం లో కూడా వారి కృషి ఎనలేనిది.ఈ సందర్భంగా విష్ణు వర్ధన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధువులు , కార్యకర్తలు , శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Arattai