NANDYAL June10:- దేవాలయ అభివృద్ధి పేరిట దాతలు నుంచి విరాళాలు సేకరించి రూ కోట్లలో దోచుకున్నాను అంటూ వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ చలం బాబు ఖండించారు. బుధవారం నంద్యాలలోని కేదారేశ్వరి దేవి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ సభ్యులతో కలసి ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు మంగళవారం తనపై దేవాలయ అభివృద్ధిని ఉద్దేశిస్తూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం పూర్తి అవాస్తవమని చలం బాబు అన్నారు. హిందూ దేవాలయాలపై ,హిందూ సంస్కృతి పై హిందూ ఏతర వ్యక్తి దాడికి పాల్పడడమేనని అన్నారు .ఏవైనా ప్రచురించే ముందు సంబంధిత ఆలయ అధికారి వివరణ తీసుకొని రాయటం మంచిదన్నారు. ఇప్పటివరకు ఆలయ అభివృద్ధికి దాతలు నుంచి సేకరించిన విరాళాల లిస్టును ఆయన వెల్లడించారు .తనపై దేవాలయంపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై నంద్యాలలోని మూడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి న్యాయపరంగా పరువు నష్టం దావా వేయ నునట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai