NANDYAL June11:- ఆర్.కే బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం (Summer Camp Tournament – 2026) ముగింపు వేడుకలు మరియు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సమ్మర్ క్యాంప్‌లో మొత్తం 100 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని బ్యాడ్మింటన్ క్రీడలో శిక్షణ పొందారు.
ఈ ముగింపు వేడుకలకు శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల ఛైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ జి. రామకృష్ణ రెడ్డి గారు, విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ జి. హేమంత్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ప్రొఫెసర్ డాక్టర్ జి. రామకృష్ణ రెడ్డి గారు (ఛైర్మన్, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థలు) మాట్లాడుతూ”వేసవి సెలవుల్లో పిల్లలు కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటూ ఇలాంటి క్యాంపుల ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ మరియు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అభినందనీయం. పిల్లలందరూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా అద్భుతంగా రాణించవచ్చు, దానికి నిరంతర కృషి, కఠిన శ్రమ ఎంతో అవసరం.మన కాలేజీకి చెందిన క్రీడాకారిణి సౌజన్య ఆల్ ఇండియా లెవెల్ మరియు ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ) స్థాయిలో రాణించి కాలేజీకి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. రాబోయే తరం పిల్లలను కూడా స్పోర్ట్స్ వైపు నడిపించేలా తల్లిదండ్రులు పూర్తి ప్రోత్సాహాన్ని అందించాలి. చదువుతో పాటు క్రీడలు కూడా జీవితంలో ఎంతో ముఖ్యం అని తెలిపారు.

డాక్టర్ జి. హేమంత్ రెడ్డి గారు (డైరెక్టర్, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థలు) మాట్లాడుతూ “ప్రస్తుత కాలంలో బాడీ ఫిట్నెస్ మరియు స్పోర్ట్స్ ప్రతి ఒక్కరికి అవసరం. బ్యాడ్మింటన్ క్రీడ ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, చురుకుదనం మరియు సమయస్ఫూర్తి పెరుగుతాయి. ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా పిల్లలు క్రమశిక్షణను, క్రీడా స్ఫూర్తిని అలవర్చుకున్నారని నమ్ముతున్నాను. ఇంతటి చక్కటి శిక్షణను అందించిన అకాడమీ నిర్వాహకులను, కోచ్‌ను అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు.
ఎమ్. సాయినాథ్ రెడ్డి గారు (హెడ్ కోచ్, ఆర్.కే బ్యాడ్మింటన్ అకాడమీ) మాట్లాడుతూ “గత 40 రోజులుగా పిల్లలు చూపించిన క్రమశిక్షణ, నేర్చుకోవాలనే తపన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడారు. భవిష్యత్తులో వీరిలో ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా ఎదుగుతారనే నమ్మకం నాకుంది. క్రీడలను ప్రోత్సహిస్తున్న విద్యాసంస్థల యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలిపారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai