NANDYAL July20 :- నంద్యాల మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో, డాక్టర్ మధుసూదనరావు తల్లిదండ్రులు చిత్తలూరి వెంకట శెట్టి, పుల్లమ్మ ల జ్ఞాపకార్థం ప్రతి ఏటా నిర్వహించే 36 ఉచిత శస్త్ర చికిత్సల శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో ఘనంగా జరిగింది.

మధుమణి ఆసుపత్రి నిర్వహకులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ నాగమణి,డాక్టర్ మణిదీప్ ల నిర్వహణలో,ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు,మాజీ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు, లయన్స్ సేవా సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ వేణుగోపాల రెడ్డి, ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా శిబిర నిర్వాహకులు డాక్టర్ మధుసూదన్ రావు,డాక్టర్ నాగమణి,డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ వారం రోజులలో యభై లక్షల విలువ చేసే వందకు పైగా చెవి,ముక్కు,గొంతు శస్త్ర చికిత్సలను పూర్తి ఉచితంగా చేస్తున్నామని, వారం రోజులపాటు ఓపీ సేవలు ఉచితంగా అందించి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు . ఈ వారం రోజుల పాటు నిర్వహించే శస్త్ర చికిత్సలను తమతోపాటు దేశంలో పేరెన్నిక గన్న చెవి ముక్కు గొంతు నిపుణులు పాల్గొని చేయడం జరుగుతుందని తెలిపారు.

వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ మాట్లాడుతూ వరుసగా 35 సంవత్సరాల పాటు ఉచిత శస్త్ర చికిత్సల శిబిరం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. వారి సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. పేదలకు ఖరీదైన ఉచిత శస్త్ర చికిత్సల సేవలు అందించడం ఈ ప్రాంత ప్రజలకు గొప్ప వరం అన్నారు
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ డాక్టర్ మధుసూదన రావు నంద్యాలలో కోట్లాది రూపాయల విలువ చేసే అత్యంత ఆధునిక పరికరాలతో నగరాలలోని కార్పొరేట్ స్థాయి వసతులతో ఆసుపత్రి ఏర్పాటుచేసి సాధారణ ప్రజానీకానికి అందుబాటులో వైద్యం అందించడం అభినందించ దగిన విషయమన్నారు. డాక్టర్ మధుసూదన రావు వైద్య సేవలు వైద్య రంగానికి గర్వకారణం అన్నారు.

డాక్టర్ వేణుగోపాల రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ మణిదీప్ లు అత్యాధునిక వసతులతో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయడం రాయలసీమ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు.పది మందికి వినికిడి యంత్రాలను ఉచితంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగమణి,డాక్టర్ మణిదీప్, నంద్యాల ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ,డాక్టర్ రోహిత్,ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి,డాక్టర్ మధుప్రీతి, డాక్టర్ వంశీ, మధుమణి కుటుంబ సభ్యులు ప్రణీత్,సింధూ, బొగ్గరపు నాగరాజు , చిత్తలూరి శేషఫణి, ఉచిత శస్త్ర చికిత్స శిబిరంలో ఆపరేషన్ చేయించుకోబోయే ప్రజలు,ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
మధుమణి ఆసుపత్రి తరుపున అతిధులను ఘనంగా సత్కరించారు.
Arattai