NANDYAL july 23:- జిల్లాలో ఓటర్ల డేటా డిజిటైజేషన్, ఫ్యామిలీ మ్యాపింగ్, ఎనోమలీస్ పరిష్కార పనులను తక్షణమే నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఈఆర్వోలతో ప్రత్యేక ఓటర్ల సమగ్ర నమోదు పురోగతిపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో మొత్తం 14,05,443 మంది ఓటర్లలో 12,30,715 మంది ఓటర్ల వివరాలు డిజిటైజ్ చేశారని , వీరిలో 26,414 ఓటర్ల మ్యాపింగ్ పూర్తికాలేదని, ప్రతి నియోజకవర్గం ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పూర్తి చేయాలని ఆదేశించారు. ఓపెన్‌లో ఉన్న రోల్‌బ్యాక్ కేసులను వెంటనే పరిష్కరించడంతో పాటు పెండింగ్ మ్యాపింగ్‌లను పూర్తి చేసి డేటాను సకాలంలో అప్డేట్ చేయాలని సూచించారు. మ్యాపింగ్ ప్రక్రియలో కేవలం సంఖ్యల పెరుగుదలకే కాకుండా ఖచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తండ్రి, తల్లి పేర్లలో స్వల్ప తేడాలు, జన్మతేదీల వ్యత్యాసాలు, వయస్సు సంబంధిత సాంకేతిక లోపాలు వంటి ఎనోమలీస్ ను క్షుణ్ణంగా పరిశీలించి సరైన ధృవీకరణ అనంతరమే క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధం లేని కుటుంబ సభ్యులతో మ్యాపింగ్ చేయకుండా నిబంధనల ప్రకారం మాత్రమే డేటాను నమోదు చేయాలని సూచించారు. జీరో ప్రగతి నమోదైన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, మిగిలిన మ్యాపింగ్‌లను అత్యవసర ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఆర్డీవో, తహసీల్దార్ తమ పరిధిలోని సిబ్బందిని సమన్వయం చేసుకుని పనులను నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన చోట అదనపు సిబ్బందిని వినియోగించాలని సూచించారు.
ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి, మైక్రో ప్లానింగ్‌తో పనులు నిర్వహించాలని, నిర్ణీత గడువులోగా మ్యాపింగ్, డిజిటైజేషన్, ఎనోమలీస్ పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
Arattai