NANDYAL july 23:- వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నంద్యాల జిల్లా గణేష్ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాలలో ఉన్న వినాయక చవితి కమిటీ పెద్దలతో కార్యకర్తలతో జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం రామకృష్ణ పీజీ కళాశాల నందు జి రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జరిగింది.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ మహోత్సవ సమితి ఉపాధ్యక్షుడు జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పండుగను ముందస్తు ప్రణాళికలతో ఎటువంటి సమస్యలు,ప్రమాదాలు లేకుండా ప్రశాంతంగా,శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణేష్ మహోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ మాట్లాడుతూ దేశంలో వినాయక చవితి ఉత్సవాలకు ప్రారంభించిన మొదటితరం స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో పాటు పర్యావరణహితంగా నిర్వహించాలని తెలిపారు.మట్టి (సహజ) వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP), రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను ఉపయోగించకుండా పండుగ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, ఆకులు, మట్టి, సహజ పదార్థాలతో తయారైన అలంకరణ సామగ్రిని ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.

నంద్యాల జిల్లా కార్యదర్శి భూమా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహాల నిమజ్జనం ప్రభుత్వ అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే నిర్వహించి, చెరువులు, కాలువలు కాలుష్యం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇటువంటి సమస్యలు లేకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, పరిశుభ్రమైన మరియు పర్యావరణహితమైన వినాయక చవితి వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గణేష్ సమితి నిర్వాహక సభ్యుడు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి ,పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి విజయకుమార్ ,విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి , సందీప్ గారు, మేడ మురళి , నర్ల మహేశ్వర్ రెడ్డి ,సత్యం,దమం శంకర్,సుహాసిని.ఇందిరా నాగిరెడ్డి , గౌరు హుస్సేన్ రెడ్డి పాల్గొన్నారు.
Arattai