NANDYAL July26 :- ఆదివారం నంద్యాల పట్టణంలోని శ్రీ బద్రావతి భావనారాయణ స్వామి దేవాలయం నందు చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య గారి 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమం రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ భీమనపల్లె వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.

ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కీర్తి శేషులు ప్రగడ కోటయ్య జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందు కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మంగళగిరి శాసనసభ్యులు మంత్రివర్యులు అయినా శ్రీ నారా లోకేష్ గారికిధన్యవాదములు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

కీర్తిశేషులు ప్రగడ కోటయ్య రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి రాజ్యసభ సభ్యులుగా పదవులు అలంకరించడం జరిగినదని పేర్కొన్నారు. ఆయన ప్రజా జీవితంలో చేనేత వర్గాలకు , చేనేత కార్మికుల సంక్షేమం కోసం అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి చేనేత సొసైటీలు ఏర్పాటు చేసేందుకు కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దలు శ్రీ చెన్నా వెంకటేశ్వర్లు, గారు పుత్త రామకృష్ణ ,గారు గాజుల వేణుగోపాల్, గాజుల శంకర్, ఉద్దంటి సతీష్ , జి వి రామయ్య, రామచంద్రుడు ,మద్దాలమోహన్ చింతలపల్లె వాసు, కోట నాగరత్నమ్మ ,రామ తులసి ,శోభారాణి ,మరియు నంద్యాల పద్మశాలి సంఘం సభ్యులు,కుల బాంధవులు పాల్గొన్నారు.
Arattai