NANDYAL July26 :- విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక భగీరథ సదన్, టెక్కె లో కార్గిల్ విజయ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు పట్టణ అధ్యక్షులు సానం రెడ్డి సుహాసిని తెలిపారు.

ఈ వైద్య శిబిరంలో డా ఎస్వీ ప్రమోద్ రెడ్డి గ్యాస్ట్రో స్పెషలిస్ట్ మరియు డా శ్రీ వాణి రెడ్డి చిన్న పిల్లా వైద్య నిపుణులు సుమారు 60 మందికి ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కార్గిల్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ విశ్రాంత జవాన్లను పట్టణ కమిటీ సభ్యులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్లి సందీప్ , మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ , జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్ , సేగు సుబ్రహ్మణ్యం , నాగిరెడ్డి , శేషసాయి , డా లలిత సరస్వతీ , మురళీధర్ రెడ్డి మరియు సేవా విభాగం సభ్యులు పాల్గొన్నారు.
Arattai