NANDYAL July26 :- చేనేత ఉద్యమ పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత శ్రీ ప్రగడ కోటయ్య గారి జయంతిని పురస్కరించుకుని జిల్లా రెవెన్యూ అధికారి డి. రామునాయక్ అధ్యక్షతన సోమవారం ఆయన ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఆర్ఓ రామునాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం, సహకార సంఘాల అభివృద్ధి, పేదల అభ్యున్నతి, సాగునీటి, మురుగునీటి పారుదల సౌకర్యాల కల్పనలో శ్రీ ప్రగడ కోటయ్య గారు విశేష కృషి చేసిన మహనీయులని అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొని, అనంతరం ప్రజాప్రతినిధిగా ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు.
Arattai