MANGALAGIRI Oct 31:- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం దివ్యాంగులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు.

పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూట్రిఫుల్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు.రోజుకు ఎంతమంది న్యూట్రిఫుల్ యాప్‌లో రిజిస్టర్ అవుతున్నారని ఆరా తీశారు.

యాప్‌లో రిజిస్టర్ ప్రాసెస్‌ను ఏ విధంగా మోనిటర్ చేస్తున్నారని, రిజిస్టర్ అయిన వారిని ఎలా గైడ్ చేస్తున్నారని అడిగి తెలుసుసుకున్నారు.

Arattai