నంద్యాలలోడాక్టర్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లాల ఆపరేషన్లు
NANDYAL Aug 05:- నంద్యాల పట్టణంలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి శుక్లాలు ఆపరేషన్లు నిర్వహించినట్లు డాక్టర్ లక్ష్మయ్య, డాక్టర్ సుష్మ తెలిపారు.కంటి నరాలపై షుగర్ చూపే ప్రభావం గురించి గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, గత ఏడాది కాలంగా ప్రత్యేకంగా డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గత 20 సంవత్సరాల నుంచి వేలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు.షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తమ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలని,నిర్లక్ష్యం చేస్తే కంటిచూపుతో పాటు కిడ్నీలు మరియు నరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వారు తెలిపారు.

క్యాంపుల్లో కంటి నరాల పరీక్షలు చేయడానికి వీలుగా పోర్టబుల్ ఫండస్ కెమెరా వంటి ఆధునిక పరికరాలను అమెరికాలో ఉంటున్న తమ మిత్రులు డాక్టర్ సుబ్బారావు ఆర్థిక సహకారంతో సమకూర్చుకున్నారు. ఈ క్యాంపుల నిర్వహణలో సత్య సేవా సమితి, స్థానిక సేవా సమితి సభ్యులతో పాటు ఉదయ్ శంకర్, సేవా భారతి రాంప్రసాద్, వాసుదేవరెడ్డి వంటి వారు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Arattai