లయన్స్ సేవా సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎన్నికైన డాక్టర్ రవి కృష్ణ ను అభినందించిన వివిధ సంస్థలు
NANDYAL Aug08 :- కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం, నంద్యాల జిల్లా చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు,గత 30 సంవత్సరాలుగా నంద్యాల లయన్స్ క్లబ్ ద్వారా విస్తృత సేవలు అందిస్తున్న డాక్టర్ గుర్రాల రవికృష్ణ అంతర్జాతీయ లయన్స్ సేవా సంస్థ డిస్ట్రిక్ట్ 316 జె వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా గత వారం బాధ్యతలు తీసుకున్న సందర్భంగా కళారాధన, లయన్స్ క్లబ్,నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం, నంద్యాల జిల్లా చిన్న,వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ప్రతినిధులు స్థానిక కళారాధన, దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా సేవలు విస్తృతం చేస్తామని, కళారాధన సాంస్కృతిక కార్యక్రమాలు, దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని, చిన్న వీధి వ్యాపారస్తుల ఉపాధి రక్షణ కోసం సహకరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్,మేడా చంద్రశేఖర్, కోశాధికారి సురేష్, జోన్ చైర్మన్ సోమేశుల నాగరాజు,ఉపాధ్యక్షులు పోసిన సుబ్బారావు,కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి, ప్రముఖ నాటక, సినీ, టీవీ నటులు ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, కార్యదర్శి డి. సి. పి. శర్మ, కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి, రామయ్య, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి.రమణయ్య, కార్యదర్శి రామలింగం, హనీఫ్ ఖాన్, వెంకటరావు,నంద్యాల జిల్లా చిన్న వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మహబూబ్ బాషా , కార్యదర్శి మహేష్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Arattai